Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేడు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి పోలీసు అకాడమీలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 36 ఏళ్లుగా పోలీసు శాఖలో ఒక సభ్యుడిగా ఉంటూ.. అందరి ఆదరాభిమానాలు చూరగొనడానికి ప్రతిక్షణం పనిచేశానని తెలిపారు. ఈ పదవీ విరమణ పరేడ్ తనను ముగ్ధుడిని చేసిందన్నారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న అంజనీ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నూతన రాష్ట్రంలో 8 ఏళ్ల పాటు పోలీస్ విభాగంలో కీలక పదవులు నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ సహకారంతోనే పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు శాఖా పరంగా అద్భుత పనితీరు ప్రదర్శించగలిగామని మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు, వివిధ కాలనీల సంఘాలు, కార్పొరేటర్ల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామన్నారు. 36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.