Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్:
రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదం తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పంత్ వెంటనే కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఈ తరుణంలో పంత్‌ను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ఢిల్లీకి తరలిస్తామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. డీడీసీఏ టీమ్ మ్యాక్స్ ఆస్పత్రికి చేరుకుందని, అక్కడ పంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలింది. తీవ్రంగా గాయపడిన పంత్‌కు మ్యాక్స్ ఆస్పత్రి వైద్యులు ఇప్పటికే పలు సర్జరీలు చేశారు. అయితే, పరిస్థితుల్ని బట్టి మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విమానంలో ఢిల్లీ తరలిస్తామని శ్యామ్ శర్మ తెలిపారు.