Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: సినీ పరిశ్రమలో ప్రముఖ ఆస్ట్రేలియన్ నటుడు బాబీ డ్రైసెన్(56) కన్నుమూశారు. నిద్రలోనే తన నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యంగ్ టాలెంట్ టైమ్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ హఠాన్మరణాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులు జిర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సహానటీనటులు, ఆస్ట్రేలియా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. యంగ్ టాలెంట్ టైమ్(1979), నెయిబర్(1985) టీవీ సిరీస్, యంగ్ టాలెంట్ టైమ్ టెల్స్ ఆల్(2001) ప్రోగ్రామ్స్ ద్వారా ఆయన మంచి గుర్తింపు పొందారు.