Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తులు కోరుతుంది. ఈ తరుణంలో మొత్తం 526 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనో వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. అయితే దీనిలో హైదరాబాద్లో 54 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 526ఇందులో అసిస్టెంట్ (ఎల్డీసీ) 339, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 154, యూడీసీ 16, స్టెనో 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, నిర్ణీత వేగంలో ఇంగ్లిష్ టైప్ చేయగలిగి 18 నుంచి 28 ఏండ్ల వయస్సులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: 2023, జనవరి 9
వెబ్సైట్: apps.shar.gov.in