Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒకప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేశ్, కొంతకాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఆయా సినిమాలు ఫంక్షన్స్ లో మెరుస్తూ సందడి చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'మొదటి నుంచి కూడా నాకు కమ్యూనిటీ అంటే ఏమిటో తెలియదు. మన కమ్యూనిటీనే కదా అని ఆకలితో ఉన్నవాళ్లకి ఎంతమంది అన్నం పెడుతున్నారు? అంటూ ఎదురు ప్రశ్నించాడు. 'ఇండస్ట్రీలో ఎవరైనా సరే మా వాడు అని హెల్ప్ చేయరు .. విషయం ఉందనుకుంటే చేరదీస్తారు అంతే. నందమూరి ఫ్యామిలీకి నేను దూరంగా ఉంటానని హైలైట్ చేశారు. అలాంటిదేం లేదు. ఎన్టీఆర్ తో కూడా నేను సినిమాలు చేశాను గదా. బాలయ్య బాబుతో శత్రుత్వం లేదు .. మిత్రత్వం లేదు. మనం ఎంతవరకూ ఉండాలో ఆంతవరకూ ఉంటేనే మంచిది. చిరంజీవిగారి ఫ్యామిలీతో చనువు ఎక్కువ గనుక వాళ్లతో అలా ట్రావెల్ అవుతూ వెళ్లాను అంతే' అన్నాడు. ఇక్కడ రాజులందరూ ఒకటిగానే ఉంటారు. మంత్రులు .. సైనికులు దూరంగా ఉండటం ఎందుకు? ఇక్కడ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ రోజున ఎవరు కలుస్తారో .. ఎవరు విడిపోతారో తెలియదు. సమయం .. సందర్భం .. అవసరం ఇవే ఇక్కడ లెక్కలోకి వస్తాయి. అవసరమే ఇక్కడ జీవితాలను నడిపిస్తుంది. అవసరమే మనతో మాట్లాడిస్తుంది .. అవసరమే మనతో పోట్లాడిస్తుంది. కత్తులు దూసుకునేలా చేసేది .. కలిసిపోయేలా చేసేది అవసరమే' అంటూ చెప్పుకొచ్చాడు.