Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో 1993 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు డీజీపీ ర్యాంకులు ప్రకటించింది. వారిలో మహేశ్ దీక్షిత్, అమిత్‌గార్గ్, పీ.వీ సునీల్‌కుమార్‌కు డీజీపీ హోదా కల్పించింది.
ప్రస్తుతం మహేశ్ దీక్షిత్, అమిత్‌గార్గ్ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. మహేశ్ చంద్ర లడ్హాకు ఏడీజీగా పదోన్నతి కల్పించారు. అంతే కాకుండా శ్యామ్ సుందర్, త్రివిక్రమ వర్మ, పాలరాజుకు ఐజీలుగా, కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, అమ్మిరెడ్డికి డీఐజీలుగా పదోన్నతులు కల్పించారు. దీపికా పాటిల్, కృష్ణారావు, అమిత్ బర్దార్‌కు జూనియర్ అడ్మినిస్ట్రేటీవ్ గ్రేడ్‌గా పదోన్నతులు కల్పించారు.