Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుపతి
ఈరోజుతో 2022 సంవత్సరం ముగుస్తోంది. ఈ తరుణంలో తిరుమల హుండీ ఆదాయం లెక్కించగా రికార్డు స్థాయిలో పెరిగింది. శ్రీవారిని ఈ ఏడాది దర్శించుకున్న భక్తులు రూ. 1,446 కోట్లను హుండీలో వేశారు. టీటీడీ ఈ ఏడాదికి గాను గణాంకాలను విడుదల చేసిం హుండీ ఆదాయం వివరాలను ఈ గణాంకాలలో తెలిపింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35,58,325 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. మొత్తం 1,08,51,706 మంది భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించారు. భక్తులకు 11,42,78,291 లడ్డూలను టీటీడీ విక్రయించింది.