Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదానికి గురై డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్న యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ తెలిపారు.తొలుత ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. డెహ్రాడూన్‌లో మ్యాక్స్ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స చేసినట్టు ఆయన తెలిపారు. డీడీసీఏ నుంచి ఓ బృందం డెహ్రాడూన్‌కు వెళ్లి పంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిందని శర్మ వివరించారు. ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల్లో ఫుటేజీ ప్రకారం.. పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.