Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణ సందర్భంగా ఆలయానికి రూ. 7.50 కోట్లు ఆదాయం వచ్చిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు భవాని దీక్షల విరమణ జరిగిందన్నారు. ఈ తరుణంలో భక్తుల సౌకర్యార్ధం రూ. 100లు,రూ.300 లు, రూ. 500ల టికెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన విరమణ సందర్భంగా 5 లక్షల 40 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారని, 15 లక్షల లడ్డులు అమ్ముడు అయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది దసరా, దీక్షలకు పర్మినేట్ హోమ గుండాలు ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.