Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
కశ్మీర్ లోయలో 2022లో 42 మంది విదేశీ ఉగ్రవాదులతోపాటు మొత్తం 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని జమ్ము కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రవాద సంస్థల్లో యువత చేరికలు 37 శాతం తగ్గుముఖం పట్టాయని ట్వీట్ చేశారు. కశ్మీర్లో భద్రతా బలగాలు 93 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ చేపట్టాయని తెలిపారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల్లో 108 మంది లష్కర్-ఏ-తొయిబా, 35 మంది జైషే మహమ్మద్, 22 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్, నలుగురు ఆల్ బాద్ర్, ముగ్గురు అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ ఉగ్రవాదులు ఉన్నారు.
భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు, ఉగ్రవాద దాడుల్లో 14 మంది జమ్ముకశ్మీర్ పోలీసులతోపాటు 26 మంది భద్రతా దళాల జవాన్లు ప్రాణాలు కోల్పోయారని విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రదాడుల్లో 29 మంది పౌరులు మృతి చెందారన్నారు. ఈ ఏడాది కొత్తగా 100 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరారని, గతేడాదితో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ అన్నారు.