Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జమ్మూ
ఈ ఏడాదిలో పాక్ జాతీయులు 56 మంది సహా మొత్తం 168 మంది ఉగ్రవాదులను హతమయ్యారని, మరో 159 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంలో జీరో టెర్రర్ కార్యకలాపాలను సాధించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు సరైన దిశలో ముందుకెళ్తున్నాయన్నారు.
2022 ముగింపు సందర్భంగా శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పాక్ ప్రేరేపిత 146 టెర్రర్ మాడ్యూల్స్, ఒక్కొక్కరు నలుగురి నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్టివ్ అండ్ టార్గెటెడ్ హత్యలు, గ్రెనేడ్, ఐఈడీ దాడులను పసిగట్టి అరికట్టామన్నారు. ఈ ఏడాదిలో జమ్మూ కశ్మీర్లో వంద మంది యువకులు తీవ్రవాదంలో చేరారని, ఇది అత్యంత కనిష్ఠమని, ప్రస్తుతం 100 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న యాక్టివ్ టెర్రరిస్టుల సంఖ్యను రెండంకెల సంఖ్యకు తగ్గించేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్న సమయంలో వారిలో ఎక్కువ మందిని హతం చేసినట్లు తెలిపారు.