Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
బొలీవియాలో కొత్త ఏడాదికి ముందు రోజు హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫెర్నాండోకు స్థానిక కోర్టు జడ్జి సెర్గియో పచెకో నాలుగు నెలల ప్రి-ట్రయల్ శిక్ష విధించారు. అతడిని రాజధాని లాపేజ్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు తరలించాల్సిందిగా పోలుసులను ఆదేశించారు.
ఈ తరుణంలో ఫెర్నాండోను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. లాపేజ్ పోలీస్ స్టేషన్ నుంచి వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరైన ఆయన బొలీవియాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తాను ఈ పోరాటాన్ని విరమించను అని తెలిపాడు. అరెస్టును వ్యతిరేకిస్తూ వందలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. పాత టైర్లను కాల్చడమే కాకుండా పోలీసులపైకి పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు.