Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు నూతన సంవత్సరం ముంగిట ఏపీ ప్రభుత్వం టీపి కబురు చెప్పింది. ఆయనకు డీజీపీ హోదాతో పదోన్నతి కల్పించింది. ఇప్పటివరకు సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగుతున్నారు ముఖ్యంగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించింది.సునీల్ కుమార్ వైఖరిపై రఘురామ కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.
సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనపై వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించింది. ఇకపై ఆయన డీజీపీ ర్యాంకుతో సీఐడీ చీఫ్ గా కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన శ్రేణిని రూ.2,05,400-రూ.2,24,400గా తెలిపింది. పదోన్నతి 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు. అటు, డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేశ్ దీక్షిత్, అమిత్ గార్గ్ లకు కూడా డీజీపీ హోదాతో ప్రమోషన్ కల్పించారు.