Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నా తరుణంలో తాజాగా మరో మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మే లేదా జూన్లో నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
విద్యాశాఖలో మరో 71 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. ఇంటర్ కమిషనరేట్లో 40 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 21వ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లుది, మే లేదంటే జూన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ 78 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, 1 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.