Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీర్కూర్ గ్రామశివారులో ఉన్న తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరం -2023 క్యాలెండర్‌ను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. శనివారం హైదరాబాద్‌లోని మలక్‌పేట్ తిరుమల బ్యాంకు సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ ఈ సందర్బంగా తెలంగాణ తిరుమల దేవస్థానం బీర్కూర్ నూతన సంవత్సర క్యాలెండర్, దేవస్థానం ప్రాశస్త్యాన్ని తెలియజేసే వీడియో డీవీడీని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆహ్లాదకర వాతావరణంలో నెలకొల్పిన శ్రీవారి ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ దేవాలయం తెలంగాణలోని అగ్రస్థానంలో ఉన్న దేవాలయాల్లో ఒకటిగా నిలిచేందుకు కారకులయ్యారని, ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధ్ది పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు మంజూరుచేసిందన్నారు. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. రాజగోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, కొండమీదికి రోడ్డు, కల్యాణ మండపం, వసతిగృహం, కల్యాణకట్ట తదితర పనులు పూర్తికావస్తున్నాయని వివరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో తిరుమల బ్యాంకు చైర్మన్ ఎన్.చంద్రశేఖర్, డైరెక్టర్లు, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.