Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేడు 'నుమాయిష్' (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి 15 వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయా వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కాగా, ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీశ్ రావు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.