Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని తేడాలేకుండా ప్రజలంతా సంబురాల్లో మునిగిపోయారు. కొత్త ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాజధాని మొదలు పట్టణాలు, పల్లెల్లో యువత కేరింతలు కొట్టారు. 2022కి వీడ్కోలు.. 2023కి వెల్కమ్ చెబుతూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. 'హ్యాపీ న్యూ ఇయర్'అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు. మరోవైపు అర్ధరాత్రి నుంచే మహిళలు ఉత్సాహంగా ఇళ్ల ముందు వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు.