Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ నెల 5న దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తున్న తరుణంలో మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12 నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.