Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాబూల్
ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్‌లోని మిలటరీ విమానాశ్రయం వెలుపల ఆదివారం భారీ పేలుడు సంభవింయింది. ఈ తరుణంలో పది మంది మరణించగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయని అధికార ప్రతినిధి అబ్ధుల్ నఫీ టాకోర్ తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విమానాశ్రయం సమీపంలో ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని స్ధానికులు తెలిపారు. విమానాశ్రయ ప్రాంతాన్ని భద్రతా దళాలు సీజ్ చేసి ఆ ప్రాంతానికి చేరుకునే రోడ్లను మూసివేశాయి.