Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువకులు, మహిళలు, చిన్నారులు వారికి ఇష్టమైన విధంగా వేడుకలు జరుపుకోవడం సంప్రాదాయంగా మారింది. మరికొన్ని చోట్ల క్రీడా పోటీలు, ఇంకొన్ని చోట్ల సాంస్కృతిక పోటీలు జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. అయితే ఏపీలోని రెండు గ్రామాలు ప్రతి యేట కబడ్డీ పోటీలు నిర్వహించుకుని నూతన సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నారు. కాని ఈ సారి అపశ్రుతి దొర్లింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వంపాడంలో రాత్రి రెండు గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఎరుగొండ-కొవ్వాడ గ్రామ జట్ల మధ్య హోరాహోరిగా మ్యాచ్ జరుగుతుండగా ఎరుగొండ వాసి రమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే విశాఖ కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.