Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
లాటరీ పేరిట జరిగే కొందరు భారీ మోసాలకు పాల్పడుతుంటారు. బహుమతి గెలుచుకున్నారని ఫోన్ చేసి, ఆ ప్రైజ్ దక్కాలంటే కొంత డబ్బు కట్టాలని చెప్తారు. తీరా డబ్బు కట్టాక మోసగాళ్లు ప్లేటు ఫిరాయిస్తారు. ముంబైలో అలాంటి సంఘటనే జరిగింది. లక్కీ డ్రాలో బహుమతి గెలిచారని చెప్పి ముంబైలోని బోరివలీ ప్రాంతానికి చెందిన ఒకాయన దగ్గర గుర్తు తెలియని వ్యక్తి రెండు లక్షలు కాజేశాడు. లాటరీలో రూ.10.4 లక్షల విలువైన కారు గెలుచుకున్నావని అతడికి చెప్పాడు. ఆ కారు సొంతం చేసుకోవాలంటే రూ.2.10 లక్షలు కట్టాలని చెప్పడంతో అతను డబ్బు ఆన్లైన్లో చెల్లించాడు. డబ్బు కట్టినా కూడా కారు పంపించకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2019లో సదరు వ్యక్తి ఆన్లైన్లో ఒక వస్తువు కొన్నాడు. రెండేళ్ల తర్వాత మీరు లక్కీ డ్రాలో బహుమతి గెలుచుకున్నారు అంటూ అతడు వస్తువు కొనుగోలు చేసిన ఆన్లైన్ సంస్థ పేరుతో వెస్ట్‌బెంగాల్ నుంచి అతనికి ఒక లెటర్ వచ్చింది. అందులో స్క్రాచ్ కార్డు ఉంది. అందులో మీరు రూ.10.24 లక్షల కారు గెలిచారని ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పేరుతో ఒకతను ఫోన్ చేసి, ఆ కారు కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కిం రూ.2.10 లక్షలు తన అకౌంట్‌కు పంపించాలని చెప్పాడు.