Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.