Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజోరి
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో చోటుచేసుకున్న అనుమానిత ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లా డాంగ్రీ గ్రామంలో ఆదివారం ఇద్దరు సాయుధ పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. కాల్పులకు జరిపిన వారు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నట్టు అదనపు డీజీపీ తెలిపారు.