Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఆసియన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక కోసం నిర్వహించే ట్రయల్స్‌కు రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ దూరమైంది. అయితే ఇంతరు ముందు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఆసియన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి 2017లో భారత్ క్వార్టర్ఫైనల్లో థాయిలాండ్ చేతిలో ఓడిపోగా, 2019లో నాకౌట్ స్థాయికి అర్హత సాధించలేకపోయింది. కాగా 2021లో కొవిడ్ కారణంగా టోర్నీ రద్దయింది.
ఈ క్రమంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 14-19 తేదీలలో దుబాయ్‌లో నిర్వహించే ఈ టోర్నీకి జట్టును ఎంపిక చేసేందుకు ట్రయల్స్‌కు హాజరు కావాలని సైనా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సద్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్) లేఖలు జారీ చేసింది. ఈ తరుణంలో సైనా, మాళవిక ఈ ట్రయల్స్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు.