Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
లక్ష్మీనృసింహుని దర్శనానికి భక్తులు పోటెత్తడంతో యాదాద్రి జనసంద్రమైంది. 50 వేల మందికి పైగా భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఖజానాకు రూ.75.94 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది జనవరి 1తో పోలిస్తే ఇది రూ. 45,40,098 అధికం. ధర్మదర్శన క్యూలైన్లలో ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి ఆరు గంటలు వేచి ఉన్నారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లో సోమవారం ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని లక్ష్మినృసింహుని ప్రధానాలయ ఉత్తర ద్వారం వద్ద ఉదయం 6.48 గంటల నుంచి అరగంట సేపు వైకుంఠనాథుడిగా స్వామివారు దర్శనమివ్వనున్నారు.