Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు పెరిగాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. ఇక్కడ 40,655 లిక్కర్ కేసులు, 21,122 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఒక్క రోజులోనే 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది.