Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢిల్లీ
ఓ కేసు విచారణలో భార్య నగలను ఆమె వ్యక్తిగత ఆస్తిగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. భర్త అయినా సరే ముందస్తుగా అనుమతి లేకుండా నగలను తీసుకోవడం తప్పేనని స్పష్టం చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ సారథ్యంలోని డివిజన్ బెంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో భర్త తన భార్యను అత్తింటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకువెళ్లడం చేయరాదని కోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఈ కేసులో నిందితుడు అధికారులకు సహకరించడం కానీ, అపహరణకు గురైన నగలను తిరిగి స్వాధీనం చేయడం కానీ జరగలేదన్నది తమ దృష్టిలో ఉన్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేసి, పిటిషన్ను రద్దు చేయలేమని, ఈ కేసులో అరెస్టు నివారణకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనరు కోర్టును కోరారు.