Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆంధ్రప్రదేశ్
కాపు రిజర్వేషన్ల సాధన కోసం పాలకొల్లులో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను గత రాత్రి పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్ష కోసం ఆయన నివాసం వద్ద ఉదయం నుంచీ ఏర్పాట్లు జరిగాయి. తెలిపారు. ఈ తరుణంలో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.
ఈ సందర్భంగా జోగయ్యతో పోలీసులు మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై జీవో విడుదలయ్యేలా చూడాలని జోగయ్య పోలీసులను కోరారు. అంతకుముందు ఓ వీడియో విడుదల చేసిన జోగయ్య 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్టు చెప్పానని, కానీ పోలీసుల తీరు కారణంగా తక్షణం దీక్ష ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, పోలీసులు కారణమవుతారని అన్నారు.