Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుంటూరు
చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. సభ ముగిసిన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు, ఈ ఘటనపై మంత్రి జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలేనని మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలి తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో ముగ్గురుని పొట్టనపెట్టుకున్నారని, కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చారని విమర్శించారు. ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతిని ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నానని, చంద్రబాబును రాష్ట్రంలో తిరగనిస్తే ఆయన మరింత మందిని బలి తీసుకుంటారని, బాబు అధికార దాహానికి ప్రజలు బలైపోతున్నారని వ్యాఖ్యానించారు.