Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సీఎం స్టాలిన్ గుడ్న్యూస్ అందించారు. ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లకు కరవు భత్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 34 శాతంగా ఉన్న డీఏను 38శాతానికి పెంచిన సీఎం ఈ నిర్ణయం జనవరి 1 నుంచే అమలులోకి వస్తుందని స్పష్టంచేశారు.
తాజా నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 16లక్షల మందికి లబ్ధి చేకూరనుందని, ప్రభుత్వ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ డీఏ పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. డీఏ పెంపుతో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2359 కోట్లు అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.