Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇస్లామాబాద్
పాకిస్థాన్‌లో 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. దీనిలో ఏకంగా 32,000 మంది అభ్యర్థులు హజరయ్యారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. అయితే పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు.
గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పాకిస్థాన్ దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శాతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు.