Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన తరుణంలో ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం విజ్ఞతను సమర్ధించడం కానీ, నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందని కానీ సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనలేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ .1000, రూ .500 నోట్ల రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో స్పష్టం చేసింది. దీనిని చిదంబరం ప్రస్తావిస్తూ నోట్ల రద్దు నిర్ణయం వెనుక అక్రమాలు, లోపభూయిష్ట విధానాలను ఈ తీర్పు తప్పుపట్టిందని, తాము ఈ జడ్జిమెంట్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా మైనారిటీ జడ్జిమెంట్ పార్లమెంట్ కీలక భూమికను గుర్తుచేసిందని అన్నారు.