Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కొత్త ఏడాదిని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగితేలగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలు ఆర్డర్లు డెలివరీ చేసేందుకు నాన్‌స్టాప్‌గా సేవలందించాయి. ఏకంగా 5 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేశామని జొమాటో, స్విగ్గీ వెల్లడించాయి. 2022 చివరి రోజున తమ డెలివరీ టీం 3.5 లక్షల బిర్యానీ, 2.5 లక్షల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసిందని స్విగ్గీ తెలుపగా డిసెంబర్ 31న 15 టన్నుల విలువైన 16,514 బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేశామని జొమాటో వెల్లడించింది.
దేశ ప్రజలకు ఇష్టమైన ఆహారాన్ని చేరవేయడంలో తమకు సహకరించిన డెలివరీ పార్టనర్లకు ధన్యవాదాలని జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో అధికంగా బిర్యానీని ప్రజలు ఆస్వాదించగా, ఆపై పిజ్జాలను ఇష్టంగా తిన్నారు. రెస్టారెంట్ల నుంచి ఫుడ్ మాత్రమే కాకుండా చిప్స్ సహా పార్టీ కోసం పలు పదార్ధాలను ప్రజలు ఆర్డర్ చేశారు. పెద్దసంఖ్యలో చిప్స్, లెమన్స్, సోడాలను డెలివరీ చేశామని స్విగ్గీ తెలిపింది.