Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి వరంగల్ మీదుగా హైదరాబాద్కు ఈ ముఠా అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 2.13 లక్షల విలువైన కిలో ఆల్ఫా జోలం అనే మత్తు పదార్థాన్ని, ఆరు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.