Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నేత జూ ఏ మాథ్య.. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతల్ని చేపట్టనున్నారు. కేరళ రాష్ట్రానికి చెందున ఆమె కాసరగడలోని బీమనాడే నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణం చేశారు. నాలుగేండ్ల పాటు ఆమె కౌంటీ జడ్జిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఆండ్రూపై మాథ్యూ 123,116 ఓట్ల తేడాతో గెలుపొందారు.
15 ఏండ్లుగా ఆమె న్యాయవృత్తిలో ఉన్నారు. టార్చర్, సివిల్ లిటిగేషన్, క్రిమినల్ మేటర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసుల వాదిస్తుంటారు. జువెనైల్ ఇంటర్వెన్షన్, మెంటల్ హెల్త్ కోర్టుకు అధిపతిగా ఆమె కొనసాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఆమె హాజరైంది. దెలావర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.