Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చండీఘఢ్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద అధికారులు బాంబును గుర్తించడంతో పెను ముప్పు తప్పింది. పంజాబ్ సీఎం నివాసం, హెలిప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబును నిర్వీర్యం చేసే సిబ్బందిని పిలిపించారు. చండీఘడ్‌లోని కన్సల్, మోహాలి నయా గావ్ బోర్డర్ వద్ద బాంబును గుర్తించారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేశామని, ఆ ప్రాంతాన్ని సైనిక బృందం స్వాధీనం చేసుకుందని డిజాస్టార్ మేనేజ్మెంట్, చండీఘఢ్ నోడల్ అధికారి సంజీవ్ కోహ్లి చెప్పారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో లేరని అధికారులు తెలిపారు. ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం కూడా ఇక్కడకు కూతవేటు దూరంలో ఉంది.