Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా ధరూర్ మండల బాచారం గ్రామ సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పర్యాటక కేంద్రానికి వచ్చి
కోట్పల్లి నుండి తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నజీర్ ,సాయి తేజ, నుప్రా ,గౌతమి, లతో కలిసి అనంతగిరి ,కోటపల్లికి సందర్శించుకొని తిరుగు ప్రయాణంలో ధరూర్ మండల్ బాచారం కల్వర్టుకి అతివేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ధరూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.