Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాజీ హోం మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్యతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్లో మాట్లాడారు. దీక్ష విరమించాలని హరిరామ జోగయ్యను పవన్ కోరారు. పవన్ సూచనతో జోగయ్య దీక్ష విరమించారు. అగ్రవర్ణాలకు కేటాయించిన 10శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5శాతం కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ పోలీసులు దీక్షకు అనుమతివ్వలేదు. దీంతో ఆయన తన నివాసంలోనే దీక్ష చేయాలని భావించారు.