Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి కేవలం టీఎస్ ఐపాస్ , ఐటీ అనుబంధ రంగాల్లో వచ్చిన పెట్టుబడులు మాత్రమేనని తెలిపారు. రియల్ ఎస్టేట్, మైనింగ్, లాజిస్టిక్స్‌తో పాటు ఇతర రంగాల్లోకి వచ్చిన.. పెట్టుబడులను కలిపితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 8 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 22.50లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు.