Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. కచ్చితంగా లక్ష కి.మీ. ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ప్రపంచంలో మానవజీవితంలో అనేక పర్యాయాలు ఆ విషయాలు రుజువయ్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మీ అందరికి స్వాగతం చెప్పడంతో పాటు చాలా పెద్ద బాధ్యత పెట్టబోతున్నాను. ఒకప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. జీవితాలను ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యలకాపాలు మొదలుపెట్టాం. చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు.