Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం మంగళవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండికుంటవాగు ఎత్తిపోతల పథకాల అనుమతుల ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ఉమ్మడి రాష్ట్రం కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, బోర్డు నిర్వహణ, నిధులు, ఉద్యోగులు, సీడ్ మనీ, వసతి తదితర అంశాలపై సైతం చర్చ జరుగనున్నది.