Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. రైలు పేరును అక్షరధామ్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. స్వామినారాయణ్ సంస్థ ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్‌కు నివాళులర్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ దేవాలయాలను కలుపుతుందన్న ఆయన.. స్వామినారాయణ సంస్థ చేస్తున్న సేవలకు ఇదో చిరుకానుక అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ – ఢిల్లీ మధ్య 2005లో మార్చిలో తొలి సర్వీసు ప్రారంభమైంది. ఈ రైలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. 1074 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటలు ప్రయాణిస్తుంది.