Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: కొత్త ఏడాదిని ఆశాజనకంగా ఆరంభించేందుకు భారత టీ20 జట్టు సిద్ధమవుతోంది. ఈక్రమంలో ఆసియాకప్ చాంపియన్ శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతోంది. నేడు వాంఖడే మైదానంలో తొలి టీ20 జరుగుతుంది. నిజంగా ఇది సరికొత్త టీమిండియాగా చెప్పవచ్చు. రోహిత్, కోహ్లీ, రాహుల్, శ్రేయాస్, పంత్, జడేజా, భువీ, అశ్విన్, బుమ్రా, షమి వివిధ కారణాలతో ఈ సిరీ్‌సలో లేరు. అలాగే రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులోనూ కొత్త ముఖాలుండే అవకాశం ఉండడంతో యువ ప్లేయర్లకిది సువర్ణావకాశం. అటు హార్దిక్ కెప్టెన్సీకి కూడా ఈ సిరీస్ సవాల్ కానుంది. భవిష్యత్‌లోనూ తనే సారథిగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇటీవల టీ20ల్లో జట్టు నుంచి దూకుడు కనిపించడంలేదన్న విమర్శలను కూడా ఈ టీమ్ అధిగమించాలి. భారత్ నెంబర్‌వన్ స్థానంలో ఉన్నప్పటికీ.. 8వ ర్యాంకర్ శ్రీలంకను తక్కువ అంచనా వేయలేం. ఆసియాక్‌పలో అనూహ్య ఆటతీరుతో లంక విజేతగా నిలిచింది. అయితే భారత్‌లో ఈ జట్టు ఇప్పటిదాకా టీ20 సిరీస్ గెలవలేకపోయింది.