Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 152 పాయింట్ల నష్టంతో 61,015 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18,151 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, రిలయన్స్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు గత సమావేశ మినిట్స్ బుధవారం వెలువడనున్నాయి. వాటిపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లపై నేడు ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు తెలిపారు.