Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం పునఃప్రారంభం అయింది. 9 రోజుల విరామం తర్వాత ప్రారంభమైన ఈ యాత్ర 110రోజుల్లో 3వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. సెప్టెంబర్ 7వతేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగింది. ఈ యాత్ర జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో జనవరి 26వతేదీన ముగియనుంది.జనవరి 26న శ్రీనగర్లో ముగిసే యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ ‘‘హాత్ సే హాత్ జోడో’’ ప్రచారాన్ని ప్రారంభించనుంది. హాత్ సే హాత్ జోడో ప్రచార కార్యక్రమం బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి అప్పగించారు. భారత్ జోడో యాత్ర సందేశాన్ని మహిళల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంకగాంధీ ర్యాలీలు చేపట్టనున్నారు.దేశంలో పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రియాంక గాంధీ మహిళలతో ర్యాలీలు చేపట్టనున్నారు.