Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: రాష్ట్రంలో జల్లికట్టు కోలాహలం ప్రారంభమైంది. రాష్ట్ర సంప్రదాయ, సాహస క్రీడ జల్లికట్టు పొంగల్ సందర్భంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తుంటారు. మదురై జిల్లా అవనియాపురంలో ఈ నెల 15న, 16న పాలమేడు, 17న అలంగానల్లూర్లో పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు అన్ని జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పాలమేడు మున్సిపాలిటీ యంత్రాంగం, మహాలింగ మఠం సంయుక్త ఆధ్వర్యంలో పాలమేడులో నిర్వహించే జల్లికట్టు ఏర్పాట్లు సోమవారం వడివాసల్ ముందు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పాలమేడు పోటీల్లో గెలుపొందే వారికి కారు, ద్విచక్రవాహనం, ఎల్ఈడీ టీవీ, బంగారు, వెండి నాణేలు, సైకిళ్లు సహా పలు వస్తువులు బహుమతులుగా అందజేయనున్నారు. పోటీల్లో 700 మంది క్రీడాకారులు, 400 ఎద్దులు పాల్గొనున్నాయి. ఎద్దులు, క్రీడాకారులకు ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా టోకెన్లు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.