Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ దేశంలోని ఫుకెట్ నగరానికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 7.31 గంటలకు ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది.ఇండిగో విమానం 6ఈ-1763 హైడ్రాలిక్ గ్రీన్ సిస్టమ్‌ను కోల్పోవడం వల్ల ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. విమానం ఉదయం 6:25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. సాంకేతిక లోపం వల్ల 7:22 గంటలకు ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎ 320 విమానం హైడ్రాలిక్ సిస్టం వైఫల్యం కారణంగా ముంబయికు మళ్లించారు.కన్నూర్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా సాంకేతిక లోపం కారణంగా ఈ నెలలో విమానాశ్రయానికి మళ్లించారు.ఇలా తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి.