Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో నేడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ లైన్ - మీయాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేశారు. దీంతో సమ్మె ఎఫెక్ట్ మెట్రోపై పడింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళనకు దిగారు. తమకు 5 ఏళ్లుగా 11 వేల రూపాయల జీతం మాత్రమే కంపెనీ ఇస్తోందని.. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకూ జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.