Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రోడ్లపై ర్యాలీలు, సభలను నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల పాటు జగన్ కుటుంబమంతా రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? అని ప్రశ్నించారు. ర్యాలీలను రోడ్లపై కాకుండా గాల్లో చేస్తారా? అని ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు బందోబస్తు ఇవ్వడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావని అన్నారు.