Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు గృహనిర్బంధం నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జేసీ సిద్ధమయ్యారు. అదే కార్యక్రమానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరవుతుండడంతో జేసీ ప్రభాకర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా... గృహ నిర్బంధం నోటీసులు ఇవ్వడం పట్ల పోలీసుల తీరుపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు జేసీ ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.